2020లో కార్తీకమాసం పాటించే విధానం!
కార్తీకమాసం :
దీపాల పండగ దీపావళి ముగిసన మరుసటి రోజు నుండి ప్రారంభమయ్యే మాసామే "కార్తీక మాసం"! శివకేశవుల ఇరువురికి ఎంతో ఇష్టమైన మాసం "కార్తీక మాసం"! నెల రోజులపాటూ ఎంతో నియమ నిష్టలతో భక్తులు కట్టుదిట్టమైన ఆచారాలను పాటిస్తూ ఆ హరిహరాదులను భక్తి శ్రద్దలతో పూజిస్తారు. కార్తీకమాస పూజలని చేసిన వారికే కాకుండా చూసిన వారికీ కూడా మోక్షం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. దీపావళి అమావాస్య తరువాత ప్రారంభమయ్యే కార్తీక మాసం "శివుని"కి ఎంతో ప్రీతికరమైన మాసం. పురాణాల ప్రకారం 12 మాసాల్లో అత్యంత పవిత్రమైనది "కార్తీక మాసం".
" సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే,
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
యధాశివమాయో విష్ణు రేవ్వం విష్ణుమయశ్శివః
యదంతరం న పశ్యామి తదామే స్వస్తిరాయుషి."
ఈ శ్లోకం లోని అర్ధం ప్రకారం శివుడే విష్ణువని విష్ణువే శివుడని అర్ధం. శివుని హృదయంలో విష్ణువు కొలువై ఉన్నారు అలాగే విష్ణువు మనంబున శివుడే కొలువై ఉన్నందున ఎవరు అధికులని ఆలోచింపక భక్తులు శివకేశవులను తమ శక్తి కొలది పూజలాచరించి తమ జన్మ తరింపచేసుకొనే ఏకైక మాసమే "కార్తీక మాసం".
అయితే భక్తులు ఈ మాసంలో నియమ నిష్టలు ఆచరిస్తూ "కార్తీక మాసం" పూజలు చేయటం పరిపాటి. పూర్తిగా 30 రోజులు నియమ నిష్టలు ఆచరించి పూజలు చేయలేని వారు "ఏకాదశి", "ద్వాదశి", "సోమవారాలు", "కార్తీక పౌర్ణమి" రోజుల్లో పూజల్ని చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని పురాణాలూ చెబుతున్న విషయం గమనార్హం!
2020 కార్తీక మాసం లో విశిష్ట దినాలు :
ఈ సంవత్సరం 2020 లో కార్తీక మాసం 16/11/2020 మంగళ వరం కార్తీక శుద్ధ పాఢ్యమి నుండి 15/12/2020 ది బుధవారం మార్గశిర శుద్ధ గౌరీ పాఢ్యమి వరకు విశిష్ట దినములు..
తే 16/11/2020 మొదటి కార్తీక సోమవారం.
తే 18/11/2020ది న నాగుల చవితి (బుధవారం)
తే 23/11/2019 రెండవ కార్తీక సోమవారం.
తే 25/11/2020 కార్తీక శుద్ధ ఏకాదశి (బుధ వారం).
తే 30/11/2020 కార్తీక పౌర్ణిమ (సోమవారం) మరియు మూడవ కార్తీక సోమవారం)
తే 25/11/2020 కార్తీక శుద్ధ ఏకాదశి (బుధ వారం).
తే 30/11/2020 కార్తీక పౌర్ణిమ (సోమవారం) మరియు మూడవ కార్తీక సోమవారం)
తే 03/12/2020 ఆరుద్రోత్సవం (ఆరుద్ర నక్షత్రం, గురువారం)
తే 07/12/2020 నాల్గవ కార్తీక సోమవారం.
తే 11/12/2020 కార్తీక బహుళ ఏకాదశి (శుక్రవారం).
తే 12/12/2020 మాస శివరాత్రి (శనివారం)
తే 11/12/2020 కార్తీక బహుళ ఏకాదశి (శుక్రవారం).
తే 12/12/2020 మాస శివరాత్రి (శనివారం)
తే 15/12/2020 గౌరీ పాఢ్యమి (పోలి స్వర్గం) మంగళవారం.
కార్తీక మాసంలో అనుసరించాల్సిన కనీస నియమాలు :
- శిరస్నానం చేయుట.
- ఆలయ సందర్శన.
- శాఖాహార భోజనం.
- ఏక భుక్తం చేయుట.
- సాయంసంధ్యల్లో దీపారాధన.
- ప్రతిరోజూ "కార్తీక పురాణం" చదవటం లేదా వినడం.
నదీస్నానం:
కార్తీక మాసం వ్రత నియమాలలో ముఖ్యముగా చేప్పుకొన విషయాల్లో నదీస్నానం. వేకువజామునే లేచి సమీపాన ఉన్న నదిలో చాల మంది స్నానమాచరించటం తదుపరి శివకేశవుల ఆలాయాల్ని సందర్శించటం పరిపాటి. ఇలా సూర్యోదయానికి ముందు నదీస్నానం ఆచరించటం ద్వారా పారే నదిలో ఉండే అయస్కాంత శక్తి మన శరీరంలో ఉండే కొన్ని రుగ్మతల్ని తగ్గిస్తుందని సైన్స్ కూడా ధృవీకరించింది.
Nice
ReplyDelete