శ్రీరాముని 16 ఉత్తమ గుణాలు!! శ్రీరామ నవమి విశిష్టత! రామరాజ్యం ప్రత్యేకత !!! - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Tuesday, March 28, 2023

శ్రీరాముని 16 ఉత్తమ గుణాలు!! శ్రీరామ నవమి విశిష్టత! రామరాజ్యం ప్రత్యేకత !!!

sri sita rama kalyana ghattam!
శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టం 

:: శ్రీరామ నవమి విశిష్టత ::


పురాణగాధల ప్రకారం శ్రీరాముడు, అయోధ్య రాజైన దశరధుడు, రాణి కౌసల్యలు జరిపిన "పుత్ర కామేష్టి యాగ" ఫలితంగా కలిగన సంతానం. శ్రీరాముడు విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటని భక్తుల అచంచల విశ్వాసం. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు.

దశావతారాల్లో 7అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం హిందువులు ఈరోజు శ్రీరాముడు జన్మదినాన్ని పండగగా జరుపుకుంటారు.

రావణ సంహారం పిదప శ్రీరాముడు సతీసమేతంగా చైత్రశుద్ధ నవమి నాడే అయోధ్య రాజ్య పాలకుడిగా పట్టాభిషిక్తుడైనాడు. నాటి రోజే శ్రీసీతారాముల కళ్యాణం కూడా జరిగింది.  నాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు "శ్రీరామ నవమి"గా ప్రజలు ఉత్సవాలు, శ్రీ సీతారామ కళ్యాణం జరుపుకుంతుంటారు.

:: రామ రాజ్యం రాముని వ్యక్తిత్వానికి నిదర్శనం ::


శ్రీరామ చరిత్రలో రామరావణ సంగ్రామం ఒకెత్తు అయితే రామరాజ్య పరిపాలన మరొక ఎత్తు. రామరావణ సంగ్రామం గురించి పలు సందర్భాల్లో తెలిసిన విషయమే. చిన్నప్పటి నుండి రామాయణం నుండి చెప్పుకొనే కథలు అనేకం. అయితే ప్రస్తుత కాలంలో రామరాజ్య ప్రస్తావన ఎంతో అవసరం?!

నాటి నుండి నేటి వరకు అనేకమంది పాలకులు రామరాజ్యం తెస్తాం, ఇస్తాం అంటూ ప్రకటనలు గుప్పించిన వారే. భారతదేశానికి స్వతంత్రం వచ్చాక మన జాతిపిత మహాత్మా గాంధి కూడా దేశం రామరజ్యంలా సుభిక్షంగా ఉండాలని కాంక్షించిన వారే!

అయితే నేటి పాలకుల ప్రకటనల వరకే పరిమితం చేసిన రామరాజ్యం ఎలా ఉండేది? సుభిక్షంగా, ధర్మానికి ప్రతీకగా సాగిన రామరాజ్యం సామాన్యుల స్వప్నమేనా? అంటే రాముని లక్షణాలు పునికిపుచ్చుకున్న నాయకులు వస్తారా? ఇది కోటి ఉషశ్సుల ప్రశ్న? అయితే రామరాజ్యం తెస్తామన్న పాలకులకు, కోరే ప్రజలకు  సకలగుణాభిరాముని లక్షణాలు తెలుసుకోవాలి కదా!


(పై వీడియో వీక్షించి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికెషన్స్ సెట్ చేసుకోండి. అలానే వీడియో లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేస్తారని ఆశిస్తున్నాము)

:: పితృ వాక్య పరిపాలకుడు, సకల గుణాభి రాముని 16 ఉత్తమ లక్షణాలు ::

.
1.      క్రమశిక్షణ కలిగనవాడు.
2.      వీరుడు, సాహసికుడు.
3.      వేదాంతి.
4.      కృతజ్ఞుడు.
5.      సత్యవాక్కు పరిపాలకుడు.
6.      గుణవంతుడు అన్ని గుణాల్లోను ఉత్తముడు.
7.      స్వీయ నిర్ణయాలు తీసుకోగలిగిన జ్ఞాని.
8.      సర్వ జీవుల పట్ల దయకలిగినవాడు.
9.      అన్ని శాస్త్రాల్లోనూ పండితుడు.
10. సమస్తకార్యాలలోను సమర్ధుడు.
11. మంచి లక్షణాలు కలిగిన అందగాడు.
12. అత్యంత ధైర్యవంతుడు.
13. క్రోధాన్ని జయించినవాడు. ప్రశాంతచిత్తుడు.
14. సమస్తలోకల్లోనూ తెలివైనవాడు.
15. అసూయ లేని వాడు.
16. దేవతలకు కూడా భయాన్ని కలిగించే ధీశాలి.

:: శ్రీరామనవమి పూజ విధానం పాటించాల్సిన ఆచారాలు ::


సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముని జన్మదినమైన చైత్ర శుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి" గా పూజలు జరుపుకుంటాము. భారతదేశం యావత్తు పల్లె గ్రామాల్లో "రామమందిరం" ఉండనే ఉంటుంది. స్థానిక పురజనులు కమిటీలుగా ఏర్పడి ఏటేటా రాములోరి ఉత్సవాలను నవరాత్రులుగా జరుపుకొంటారు. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి.

:: శ్రీరామనవమి 2023 తేదీ  ::


ఈ  సంవత్సరం 2023 శ్రీరామ నవమి ని మార్చ్  30వ తారీఖున జరుపుకొనుటకు పెద్దల నిర్ణయం.

:: భద్రాచలం రామయ్య బ్రహ్మోత్సవాలు మరియు కల్యాణోత్సవాలు ::

 శ్రీ రామ నవమి భద్రాచలం లో అత్యంత ప్రసిద్ధమైనది. శ్రీ రామ కళ్యాణమహోత్సవము కన్నులపండుగగా జరుపుకుంటారు. ఇది దైవిక ఉత్సవం. లక్షలాది మంది భక్తులు సమావేశమయ్యి  అచంచల భక్తిపారవశ్యంతో వీక్షిస్తారు. తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ల్లో రాష్ట్రవ్యాప్తంగా లైవ్ ప్రోగ్రాంగా అందుబాటులో ఉన్న అన్ని టీవీ ఛానెల్లు ప్రసారం  చేస్తున్న ఏకైక పండుగ ఇది. ఈ 2023వ సంవత్సరానికి భద్రాచలం శ్రీరాములవారి కల్యాణోత్సవాలు  2023 చైత్ర శుద్ధ పాఢ్యమి నాడు అనగా ఉగాది నుండి మార్చ్ 22 నుండి ప్రారంభమై ఏప్రిల్ 5 వరకు కొనసాగనున్నాయి.  

మార్చ్ 22, 2023 - ఉగాది, తిరువీధి సేవ.
మార్చ్ 26, 2023 - అంకురార్పణం, తిరువీధి.
మార్చ్ 27, 2023 - తిరువీధి. 
మార్చ్ 28, 2023 అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం..
మార్చ్ 29, 2023 – ఎదురుకోలు, గరుడసేవ..
మార్చ్ 30, 2023 - శ్రీ రామ నవమి కళ్యాణం, శ్రీ రామ దీక్ష ప్రారంభం.
మార్చ్ 31, 2023 - మహాపట్టాభిషేకం.
ఏప్రిల్ 01, 2023  సదస్యం, హంసవాహన సేవ.
ఏప్రిల్ 02, 2023 - తెప్పోత్సవం, చోరోత్సవం, అశ్వ వాహన సేవ.
ఏప్రిల్ 03, 2023 - ఊంజతోత్సవం, సింహ వాహన సేవ.
ఏప్రిల్ 04, 2023-  వసంతోత్సవం, హావనం, గజవాహన సేవ.
ఏప్రిల్ 05, 2023-  చక్రతీర్ధం, పూర్ణాహుతి.


:: ఒంటిమిట్ట శ్రీకోదండరాములవారి బ్రహ్మోత్సవాలు ::


విభజిత ఆంధ్రప్రదేశ్లో శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత కొంతకాలంగా  నిర్వహిస్తూ వస్తోంది. అయితే 2023లో శ్రీకోదండరాముని బ్రహ్మోత్సవాలు మార్చ్ 30న ప్రారంభమై  ఏప్రిల్  05 వరకూ కొనసాగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో సేవలు :

మార్చ్ 30, 2023 - న్యాసాభిషేకం, అంకురార్పణం.
మార్చ్ 31, 2023 - ధ్వజారోహణం, శేషవాహనం.
ఏప్రిల్ 01, 2023 - వేణుగానలంకారం, హంసవానం. 
ఏప్రిల్ 02, 2023 వటపత్రశాయి అలంకారం, సింహ వాహనం .
ఏప్రిల్ 03, 2023  నవనీతాకృష్ణలంకారం, హనుమత్సేవ.
ఏప్రిల్ 04, 2023 - మోహినీసేవ, గరుడసేవ.
ఏప్రిల్ 05, 2023 - శివధనుర్భాణాలంకారం, ఎదుర్కోలు, కల్యాణోత్సవం, గజవాహనం.
ఏప్రిల్ 06, 2023  రథోత్సవం, ----.
ఏప్రిల్ 07, 2023 - కాళీయమర్దనాలంకారం,  అశ్వవాహనం.
ఏప్రిల్ 08, 2023 - చక్రస్నానం, ధ్వజారోహణం.
ఏప్రిల్ 09, 2023-  పుష్పయాగం.


:: రామతీర్ధంలో  శ్రీ సీతారాముల కల్యాణోత్సవాలు  ::


విభజిత ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన ప్రముఖ మరియు పురాతన శ్రీ సీతారాముల దేవాలయం విజయనగరం జిల్లా రామతీర్ధం గ్రామంలో గల దేవాయలం ఒకటి. రామతీర్ధాలు దేవాయలం ఉత్తరాంధ్రలోనే కాక ఆంధ్రప్రదేశ్లో అత్యంత పురాతన దేవాలయం. ఈ దేవాలయంలో శ్రీరామ నవమి 2023 సందర్భంగా విశేష ఏర్పాట్లు చేస్తున్నారు.

No comments:

Post a Comment