తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు 2019! - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Saturday, November 23, 2019

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు 2019!

SRI PADMAVATI AMMAVARU!

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు 2019!

నవంబరు 23 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు  టిటిడి తెలుగు వెబ్సైటు ద్వారా తెలుస్తున్నది.  తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల  తరువాత ఆ స్థాయిలో పెద్ద ఎత్తున జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశమున్నందున లడ్డూ, ఇతర ప్రసాదాలను తగినంతగా అందుబాటులో సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. క్యూలైన్ల బ్యారికేడ్లు, విద్యుదీపాలంకరణ బ్రహ్మోత్సవాల స్థాయికి తగినట్లు చేస్తున్నారు. ఇప్పటికే గోడ పత్రికలూ, కరపాత్రలతో తగిన స్థాయిలో బ్రహ్మోత్సవాల ప్రచారం పతాక స్థాయిలో జరిపినట్లు అధీకృత సమాచారం.

బ్రహ్మోత్సవల్లో ముఖ్యమైన రోజులైన నవంబరు 23న ధ్వజారోహణం ప్రారంభమై డిసెంబర్ 1వ తారీఖున ముగియనున్నాయి. అన్నిరోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి. ఈ బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన పంచమితీర్థం రోజు ఏనుగుల కోసం పసుపు మండపం నుంచి పుష్కరిణి వరకు ప్రత్యేకంగా దారిని ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపాలలో పలు ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయనున్నారు. కనులవిందుగా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఫ్రైడే గార్డెన్‌లో చూపరులను ఆకట్టుకునేలా ఫలపుష్ప, ఆయుర్వేద తదితర ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.

అదేవిధంగా భద్రత, తాగునీరు, అన్నప్రసాదంరవాణా ఏర్పాట్లపై ద్రుష్టి పెట్టినట్లు టి.టి.డి.దేవస్థానం స్పష్టం చేసింది. లక్షలాది మంది భక్తులు అమ్మవారి వాహనసేవలను తిలకించేందుకు వీలుగా ఎస్వీబీసీలో నాణ్యమైన ప్రత్యక్ష ప్రసారాలు అందించనున్నారు.

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల షెడ్యుల్ :

తేదీ / రోజు      
ఉదయం
రాత్రి
23/11/2019 శని 
ధ్వజారోహణం
చిన్నశేషవాహనం
24/11/2019 ఆది 
పెద్ద శేషవాహనం
హంస వాహనం
25/11/2019 సోమ
ముత్యపుపందిరి వాహనం
సింహ వాహనం
26/11/2019 మంగళ 
కల్పవృక్ష వాహనం
హనుమద్వాహనం
27/11/2019 బుధ 
పల్లకీ ఉత్సవం సాయంత్రం 
(వసంతోత్సవం )
గజ వాహానం
28/11/2019 గురు 
సర్వభూపాల వాహనం
గరుడ వాహనం
29/11/2019 శుక్ర 
సూర్యప్రభ వాహనం
చంద్రప్రభ వాహనం
30/11/2019 
రథోత్సవం
ఆశ్వ వాహనం

కాగా 01/12/2019 ఆదివారం నాడు పగలు చక్రస్నానం, పంచమితీర్థం మరియు రాత్రి ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

No comments:

Post a Comment