వినాయక చతుర్థి / గణేష్ చతుర్థి/ వినాయక చవితి విశిష్టత. - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Wednesday, September 8, 2021

వినాయక చతుర్థి / గణేష్ చతుర్థి/ వినాయక చవితి విశిష్టత.

వినాయక చవితి విశిష్టత మరియు 2021 తేదీ


VinayakaChavithi Subhakankshalu!

వినాయక చవితి  2021 తేదీ: 

భారత దేశం హిందూ సంస్కృతిలో  తొలి పండగైనా వినాయక చవితి పూజను పిల్లలు, పెద్దలు ఎంతో భక్తి భావంతో చేసుకొనే తొలి పూజ వినాయక చవితి / గణేష్ చతుర్థి. ప్రతి ఏటా జారుకొనే ఈ పూజ ఈ సంవత్సరం అనగా 2021లో సెప్టెంబర్  10వ తారీఖున జరుపుకోవాలని పండితుల నిర్ణయం.

ఇక తొలి పూజైన వినాయక చవితి/గణేష్ చతుర్థి కథను, విశిష్టతను తెలుసుకొందాం.

శివుడు గజసురునికి వరమిచ్చుట తదుపరి ఫలితం:

పూర్వము గజరూపాముగల ఓ రాక్షసుడు శివుని మెప్పు పొందేందుకై ఘోర తపస్సు చేస్తుండెను. భోళాశంకరుడైన శివుడు అతని తపముని మెచ్చి వరంబు కోరుకొమ్మని ప్రత్యక్షమయ్యెను. గజాసురుడు శివుని స్తుతించి “ఓ దేవా! నీవేల్లప్పుడు నా యుదరమందే ఉండవలెనని” కోరెను. భక్త సులభున్డగు భోళా శంకరుడు “తధాస్తు” అని గజాననుని ఉదరమందు చేరెను.

కైలాసమున పార్వతిదేవి భర్త జాడ తెలియక పరితపించుచు నలుద్రిక్కుల వెతకసాగెను. కొంతకాలము పిదప తన భర్త గజనుని ఉదరములో ఉండెనని తెలుసుకొని వెలుపలికి తీసుకువచ్చే మార్గము తెలియక సోదరుడైన శ్రీవిష్ణువు కడకు పోయి తన భర్త వృత్తాంతము అంతా తెలియపరచి పూర్వము భస్మాసురుని నుంచి నా పతిని కాపాడినావు. ఇపుడు ఎట్లైనను గజాసురుని ఉదరము నుంచి విముక్తి కల్పించి తీసుకురమ్మని వేడుకొనెను.

అనంతరము ఆ శ్రీహరి, పార్వతి దేవిని ఓదార్చి కైలశమునకు పంపించి బ్రహ్మాది దేవతలను పిలిపించి శివుని కాపాడుకొనుటకు గంగిరెద్దుల మేలమే సరైనదని వ్యూహాన్ని రచించెను. బ్రహ్మాది దేవతలకు తలొక వాయిద్యాన్ని చేత ధరింపచేసి, నందిని గంగిరెద్దుగా అలంకరించెను. శ్రీహరి సన్నాయిని చేతపూని గజసురుని కొరకై గజాసురపురానికి చేరుకోనేను. పిమ్మట అద్భుతంగా సన్నాయి వాయిద్యాన్ని వాయిస్తూ నందిని ఆడిన్చుచుండగా ఆ గజాసురుడు అది తెలుసుకొని తన భవనమందు అడించమని కబురంపెను. బ్రహది దేవతలు వినసొంపుగా వాయిద్యనాదాలతో పాటు, చిత్రవిచిత్రముగా శ్రీహరి నందితో చేయించిన అద్భుతమైన ఆటని మెచ్చి గజాసురుడు మీకేమి కావాలో కోరుకొమ్మని వేషధారియైన శ్రీహరిని అడిగెను. అంతటనా శ్రీహరి “నీ ఉదరమందున్న శివుని” ఇమ్మనెను.

ఈ మాట విన్న గజసురినికి అగ్నిపర్వతాలు బద్దలైనట్లు, కాలి క్రింద నేల కంపించినట్లయ్యింది. అనంతరం అతను రాక్షసాన్తకుడైన ఆ శ్రీహరేనని గ్రహించి తనకు మరణము తప్పదని తలచి “నా శిరస్సు త్రిలోకాలు పుజించేటట్లు చేసి, నా చర్మాన్ని నీవు ధరిమ్పవలేనని” శివునికి ప్రార్ధించెను. అనంతరము విష్ణువు నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని పొట్టను చీల్చి సంహరించేను.  ఆ పరమ శివుడు గజాసుర గర్భము నుండి బయటపడి విష్ణువును స్తుతించెను. విష్ణువు ఇటువంటి వారికి వరమిచ్చునపుడు జాగ్రత్త వహించమని గుర్తు చేసి బ్రహ్మాది దేవతలతో వైకుంటమునకేగెను. శివుడు నందిని అధిరోహించి కైలసమునకేగెను.

వినయకోత్పత్తి / వినాయకుని జన్మవృత్తాంతము :

శివుని రాక గురించి కైలాశాన ఉన్న పార్వతిదేవి విని మిక్కిలి సంతోషించి అభ్యంగన స్నానమాచరించే ముందు శరీరానికి నలుగు పెట్టుకొని ఆ నలుగుతో చిన్న బొమ్మని చేసి ప్రాణదానం చేసింది. ఆ బొమ్మని ద్వారానికి పాలకునిగా నియమించి ఎట్టివారిని కూడా విడిచిపెట్టరదంటూ ఆజ్ఞాపించింది. పార్వతిదేవి స్నానమాచరించిన పిదప ఆభరణాలను అలంకరించుకొనుచుండెను.

గజాసురిని ఉదర చెరసాల నుండి బయటపడిన శివుడు నందిని అధిరోహించి కైలాసాన్ని చేరుకొనెను. వాకిలి ద్వారము వద్దనున్న బాలుడు శివుని ప్రవేశమును అడ్డగించెను. అంతటా కోపోద్రిక్తుడైన పరమశివుడు బాలుని తలను తన త్రిశూలముతో తెంచి లోపలికి ప్రవేశించెను.

శివుని రాకతో పరవశించిన పార్వతిదేవి పతిపాదపద్మాలకు పూజించి పిదప ప్రియ సంభాషణములు గావించెను. సంభాషణల మధ్యలో ద్వారము వద్ద బాలుని ప్రస్తావన వచ్చెను. బాలుని వధించిన విషయము జ్ఞప్తికి వచ్చి శివుడు విచారించెను. గజసురిని శిరస్సును ఆ బాలునికి అతికించి ప్రాణము పోసేను. తదుపరి ఆ బాలునికి “గజాననుడు” అని నామకరణం చేసెను.

అంతటా గజాననుని పర్వతిపరమేస్వరులు పుత్రప్రేమతో పెంచాసాగెను. గజాననుడు కూడా తల్లితండ్రులను భక్తితో సేవించుచుండెను. గజాననుడు “అనింద్యుడు” ఒక మూషిక రాజుని వాహనముగా చేసుకొనెను.

సుబ్రహ్మణ్య స్వామి జననం – ఆధిపత్య పోరు :

కొంత కాలమునకు శివపార్వతులకు కుమారస్వామి జననము కలిగెను. సుబ్రహ్మణ్యస్వామిగా కొలవబడే కుమారస్వామి మిక్కిలి బలశాలి. అందుచే దేవతలు సేననాయకుడిగా నియమింపబడి బలశాలిగా పెరుపొందేను. సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి.

కొంతకాలానికి దేవాదిదేవతలు, మునులందరూ పరమశివుని వద్దకు చేరి తమకు కార్యములందు కలుగు విఘ్నములను తొలగించుటకు ఒకరిని అధిపతిగా నియమించమని కోరెను. గజాననుడు ఆ తను పెద్దవాడు గనక ఆ ఆధిపత్యమును తనకిమ్మని కోరెను. వెంటనే సుబ్రహ్మణ్య స్వామి లేచి గజాననుడు పొట్టివాడు మరియు త్వరగా కదలలేడు కావున ఆ ఆధిపత్యము తనకిమ్మని పోరేను. పిమ్మట శివుడు ఇరువురికుమరులను పిలచి మీరు ముల్లోకాలలోని పున్యనదులను దర్శించి స్నానమాచరించి ఎవరు నా ముందు నిలుస్తారో వారికే ఈ ఆధిపత్యమును ఇచ్చెదనని తెలియపరచెను. ఇది విన్న వెంటనే సుబ్రహ్మణ్య స్వామి తన వాహనమైన నేమలినదిరోహించి వాయువేగముతో వెడలెను.

ఇది చూచిన వినాయకుడు తండ్రి వద్దకు వెళ్లి వినయపూర్వకముగా నమస్కరించి “మీకు మిక్కిలి భక్తీతో పుజించేవాడిని మీకు నా అసమర్ధత తెలిసే ఈ పరీక్షపెట్టతగునా” అని ప్రార్ధించెను. అంతట పరమశివుడు దయతో “కుమారా! నారాయనమంత్రము పటించు” అని ఉపదేశించెను.

గజాననుడు నారాయణ మంత్రము పటిన్చుచు తల్లితండ్రుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షించుచూ కైలసమునందే ఉండెను. తత్ఫలితంగా సుబ్రహ్మణ్య స్వామి ఏ పున్యనదిలో స్నానమాచరించేదుకు చేరిన అన్న వినాయకుడు స్నానాదులు పూర్తిచేసుకొని నది ఒడ్డుమీదనుంచి వెళ్ళిపోవటం కనిపిస్తుండేది. ఇలా కోట్లాది పున్యనదులు తనకంటే ముందే స్నానమాచరించి వినాయకుడు వెళ్ళిపోవటం గమనించిన సుబ్రహ్మణ్యుడు కైలసానికి చేరి తండ్రి సమీపంలోనున్న వినాయకుని చూచి నమస్కరించి “అన్న గొప్పతనమును తెలుసుకొన్నాను ఆధిపత్యము అన్నగారికే ఇవ్వండని” తండ్రితో చెప్పెను.

పిదప వినాయకుడు పరమేశ్వరునిచే ప్రసాదింపబడిన విఘనాధిపత్యమును “భాద్రపదశుద్ధ చతుర్ధి”నాడు పొందెను. నాటి నుండి వినాయకుడు విఘ్నదిపతిగా ముల్లోకాల పేర్గాంచెను.

చంద్రుని చూచుట నీలాపనిందలు కలుగుట :

ఆనాటి నుండి ముల్లోకాల్లోనూ ప్రతి భాద్రపద శుద్ధ చవితి నాడు తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, జొన్న పొట్టలు, వెలంకాయ, అరటి పండ్లు మొదలగునవి నైవేద్యం సమర్పించి పూజలు చేస్తున్నారు. విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషంతో పెట్టిన నైవేద్యాన్ని ఆరగించి కైలాసానికేగి తన తల్లిదండ్రులైన శివపార్వతులను దర్శించుకోవాలని తొందరపడి తన వాహనమైన మూషికాన్ని అధిరోహించి ప్రయాణమయ్యెను. కైలాసాన్ని చేరుకున్న విఘ్నాధిపతి తల్లిదండ్రులను చూచి మిక్కిలి భక్తితో పాదాలకు వంగి ప్రణమిల్లగా ఉదరము దాటి చేతులు శివపార్వతుల పాదాలను తాకేందుకు పడుతున్న ఇక్కట్లు చూచి శివుని శిరస్సున ఉన్న చంద్రుడు పకా పకా నవ్వెను. ఆ వెంటనే విఘ్నేశ్వరుడు పొట్ట బ్రద్దలై కుడుములు, ఉండ్రాళ్ళు బయటకు దొర్లెను. విఘ్నేశ్వరుని స్థితి చూచిన పార్వతి దేవి కోపోద్రిక్తురాలై “నీ దృష్టి తగిలి నా పుత్రునికి ఈ దురవస్థ కలిగెను. కావున నిన్నెవరు చూచిన పాపాత్ములై నీలపనిందలు పొందుదురు గాక” అని చంద్రుని శపించెను.

అంతట సప్తఋషులు యజ్ఞం చేసి తమ భార్యలను అగ్ని ప్రదక్షిణ చేయిన్చిన సమయంలో అగ్ని దేవుడు ఋషి పట్నిలను చూచి మొహించెను. సప్తరుషులు శపించాగాలరని అగ్ని దేవుడు జగ్రత్తపడగా ఇది గ్రహించిన అగ్ని దేవుని భార్య ఒక్క అరుంధతి రూపం మినహా మిగిలిన వారి రూపాలు ధరించి భర్త కోరిక తీర్చెను. ఇది చూచిన ఋషులు అగ్ని దేవునితో ఉన్నవారు తమ భార్యలేనని తలచి కోపోద్రిక్తులై తమ భార్యలను విడిచిపెట్టారు. పార్వతి దేవి శాపం పొందిన చంద్రుని చూచుటచే రుషిపత్నిలకు ఈ గతి పట్టినది.

తరువాత రుషిపత్నిలు పరమాత్ముని ప్రార్ధించగా అగ్ని దేవుని భార్యే ఈ పరిస్థితికి కారణమని తెలుసుకొని సృష్టికర్త బ్రహ్మతో సహా కైలాసమునకేగి పర్వతిపరమేశ్వరులకు విన్నవించు కొనెను. బ్రహ్మ అక్కడే విగత జీవుడై ఉన్న విఘ్నేశ్వరునికి ప్రాణం పోసేను.

అంత దేవాదిదేవులు “అమ్మా పార్వతి దేవి! నీవిచ్చిన శాపముతో లోకములెల్ల తల్లడిల్లుచున్నవి. దయతో ఉపసంహరించుకొన” మనగా ఆ చల్లని తల్లి “ఏ రోజున చంద్రుడు వినాయకుని చూసి నవ్వేనో ఆ రోజున చంద్రుని చూచు వారు మాత్రమే నీలపనిందలు పడగలరని” అని తన శాపమును సడలించెను.

కావున భాద్రపదశుద్ధ చవితినాడు ఎవరు చంద్రుని చూస్తారో వారు నీలపనిన్దలు పడగలరని శాస్త్రము తెలియజేస్తున్నది. ఇందుకు శ్రీకృష్ణుడు, శామంతకమని, జాంబవంతుని శ్యమంతకోఖ్యానము ఓ గొప్ప ఉదాహరణ.

No comments:

Post a Comment