శ్రీ కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి. - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Saturday, April 22, 2017

శ్రీ కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి.


Sri Kanipaka Vara Siddi Vinayakudu!


ఓం గం గణపతయే నమః శ్రీ కాణిపాక వరసిద్ధి గణపతి


శ్రీ కాణిపాక వినాయకుడి ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయం గురించి వినని వారుండరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఓ బావిలో వెలసిన దేవుడే విఘ్నాలకు అధిపతి శ్రీ కాణిపాక గణపతి. ఏటేటా భాద్రపద శుద్ధ చవితి మొదలు 20రోజులు బ్రహ్మోత్సవాలు జరుపుకునే శ్రీ కాణిపాక వరసిద్ది వినాయకుడు భక్తుల విఘ్నాలను తొలగించి విజయాలను కానుకలుగా ఇచ్చే కొంగుబంగారం. ఈ బ్రహ్మొత్సవాలు ద్వజారోహణంతో ఆరంభ మై తెప్పోత్సవంతో ముగియడం ఒక సంప్రదాయం. బ్రహ్మొత్సవాల లో స్వామి హంస వాహనం, నెమలి వాహనం,  మూషిక వాహనం, శేష వాహనం, వృషభ వాహనం, గజ వాహనం, అశ్వ వాహనములతో అత్యంత వైభముగా ఊరేగుతారు. సూర్య, చంద్ర ప్రభాలను కూడా ఊరేగిస్తారు. ఇచ్చట జరిగే రథోత్స వం, పుష్ప పల్లకి సేవ తెప్పోత్స వం కనుల పండుగగా ఉంటుంది. ఈ బ్రహ్మొత్స వాలను చూడటానికి దేశము నలు మూలల నుండి ప్రజలు తండోప తండాలుగా వస్తారు. 

సంతానం లేని దంపతులు, దీర్ఘరోగులు ఈ దివ్య క్షేత్రంను దర్శించి 11 లేక 22 లేక 41 రోజులు నియమంగా స్వామిని పూజిస్తే వారికీ సంతాన ప్రాప్తి కలగటం,ఆరోగ్యం చేకూరడం జరుగుతుందని ప్రసిద్డి. ఈ విధంగా స్వామి వారి అద్భుత మహిమలు ఎన్నో భక్తులను రంజింపజేసాయి.

బాహుదా నదీతీరంలో వెలసిన శ్రీ కాణిపాకం, విభజిత తెలుగు రాష్ట్రంలో మరో ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతికి సుమారుగా 75 కిలోమీటర్ల దూరంలో కొలువైఉంది. శ్రీ కాణిపాక వరసిద్ది వినాయకుని విగ్రహం పెరుగుతూ వస్తుందని ఒక వాదన. ఇందుకు సాక్షిగా నిలచింది 50సంవత్సరాల క్రితం తయారుచేసిన వెండి కవచం. ఈ కవచం ఇప్పుడు స్వామివారికి సరిపోవక పోవటమే ఇందుకు నిదర్శన. శ్రీ కాణిపాకం గ్రామం  చిత్తూరు జిల్లాకు చెందిన ఐరాల మండలంలో ఉన్నది.

శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి సమీపంలో గల దర్శించదగ్గ ఇతర ప్రముఖ ఆలయాల వివరాలు :

  • వాయివ్య దిశలో  శ్రీ మణికంటేశ్వర ఆలయం వుంది. షణ్ముఖ,దుర్గ విగ్రహాలు చెప్పుకోదగినవి. ఈ ఆలయంలో ఎప్పుడు ఒక సర్పం (నాగుపాము) తిరుగుతూ వుంటుందని అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు ధాఖలాలు లేవు అని అది దేవతా సర్పమని,ఎంతో గొప్ప మహిమ గలదని ,ఆ పాము పడగపై మణి కుడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు ,భక్తులు చెప్పుతూ ఉంటారు.
  • శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం వుంది.పూర్వం జనమేజయుడు సర్ప యాగం చేసిన తర్వాత శ్రీ మహా విష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంను కట్టించమని అజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు.
  • కాణిపాకంలో ప్రసిద్దమైన ఆంజనేయస్వామి గుడి కుడా వుంది.
  • వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాలమండపం, అద్దాల మేడ కుడా వుంది. 

బస్సు సౌకర్యము : 

తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు కలదు. చిత్తూరు నుండి ప్రతి 10 నిముషాలకు ఒక బస్సు కలదు. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును.
రైలు సౌకర్యము :
ఆంధ్రప్రదేశ్ ఏమూల నుండి అయిననూ చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరు లేదా తిరుపతిలకు రైళ్ళు కలవు. ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా లేదా కాబ్స్ ద్వారా  కాణిపాకం చేరవచ్చు.
విమాన సౌకర్యము :
తిరుపతి(రేణిగుంట) విమానాశ్రయానికి విమానాలు కలవు. రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుపతి బస్ స్టేషన్కు సుమారుగా 15.3కి.మీ. దూరం 22 నిమిషాలు ప్రయాణించాల్సి ఉంటుంది.
వసతి సౌకర్యం :
దేవాలయ ప్రాంగణం లో వసతి సౌకర్యం నిమిత్తం ఇప్పటికే కాణిపాకం దేవస్థానం వారి 6 గదులు మరియు శ్రీ శ్రీ శ్రీ తిరుపతితిరుమల దేవస్థానం వారిచే నిర్మింపబడిన 14 గదులు భక్తుల విడిదికోసం ఉన్నవి. ఇవికాక 100 గదులు భక్తుల వసతి నిమిత్తం నిర్మాణంలో ఉన్నవని కాణిపాకం దేవస్థానం వెబ్సైట్ లో పొందుపరచబడి ఉన్నది. ఇందు నిమిత్తం దేవస్థానం వారు భక్తుల నుండి విరాళాలను కోరుతున్నారు. ఆశక్తి కలిగిన భక్తుల నేరుగా దేవస్థానం వెబ్సైట్ సంప్రదించి నేరుగా దేవస్థానంకి చేరేటట్లు పంపించగలరు

  

కాణిపాకం గూగుల్ మేప్స్ మరియు 360 దెగ్రీస్ లొకేషన్ వ్యూ !!!

No comments:

Post a Comment